jr ntr: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించిన ఆదర్శ్ బాలకృష్ణ‌!

  • అరవింద సమేత లో అతిధి పాత్ర
  • త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ఆదర్శ్
  • ఎన్టీఆర్‌కి మర్యాద ఇవ్వాలంటూ అభిమానుల ఆగ్రహం
‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో తాను అతిధి పాత్రలో నటిస్తున్నట్లు చెబుతూ, త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి తాను దిగిన ఫొటోను ఆదర్శ్ బాలకృష్ణ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ లతో కలిసి పనిచేయాలన్న తన కల నిజమైందని పేర్కొన్న ఆదర్శ్.. త్రివిక్రమ్ పేరు పక్కన 'సార్' అని పేర్కొని, ఎన్టీఆర్ పేరు పక్కన 'సార్' అన్న పదాన్ని వాడకపోవడంతో, తారక్ అభిమానులు ఆదర్శ్ ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. 
jr ntr
trivikram
Tollywood
Hyderabad

More Telugu News