Osama Bin Laden: పెళ్లి కుమారుడైన బిన్ లాడెన్ కొడుకు... నాటి హైజాకర్ కుమార్తే వధువు!

  • 9/11 దాడుల లీడ్ హైజాకర్ మహ్మద్ అట్టా
  • అట్టా కుమార్తెతో హంజా బిన్ లాడెన్ వివాహం
  • వెల్లడించిన కుటుంబ సభ్యులు
అమెరికాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన 9/11 ఉగ్రవాద దాడుల లీడ్ హైజాకర్ మహ్మద్ అట్టా కుమార్తెతో ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని 'ది గార్డియన్' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ కుటుంబీకులు వెల్లడించారు. ప్రస్తుతం తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నాడని, అయితే, అతనితో తమకు సంబంధాలు లేవని వారు వ్యాఖ్యానించారు. అల్ ఖైదా ద్వారా ప్రతీకార దాడులకు దిగవద్దని తాము హంజాను కోరుతున్నామని చెప్పారు.

కాగా, హంజా ఆచూకీని తెలుసుకునేందుకు యూఎస్, బ్రిటన్ తదితర దేశాల నిఘా సంస్థలు గత రెండేళ్లుగా తమవంతు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, హంజా ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ లో నివాసం ఉంటున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం జనవరిలో హంజాను అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసింది. 
Osama Bin Laden
Hamza Bin Laden
Mohmad Atta
Marriage
9/11
USA

More Telugu News