Pawan Kalyan: కర్నూలు జిల్లా హత్తిబెళగల్ కు బయలుదేరిన పవన్ కల్యాణ్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపటి క్రితం హైదరాబాద్ నుండి కర్నూలు జిల్లా హత్తిబెళగల్ బయలుదేరి వెళ్లారు. ఇటీవల అక్కడ జరిగిన క్వారీ ప్రమాద ఘటన ప్రదేశాన్ని పరిశీలించి, తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిని, మృతుల బంధువులను పవన్ పరామర్శిస్తారు. పవన్ కల్యాణ్ కర్నూలు పర్యటన నేపధ్యంలో జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.