Techie: ఫేస్‌బుక్‌ ద్వారా నిర్భయంగా డ్రగ్స్ అమ్ముతున్న హైదరాబాద్ టెక్కీ.. అరెస్ట్

  • డ్రగ్స్ సిద్ధంగా ఉన్నాయంటూ ఫేస్‌బుక్ పోస్టు
  • ఎన్‌క్రిప్ట్ కాని ప్లాట్‌ఫాంలో మెసేజ్
  • కొకైన్, గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌కు చెందిన ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఫేస్‌బుక్ ద్వారా బహిరంగంగా డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. గత నెల 31న కౌస్తవ్ బిస్వాస్ అనే టెక్కీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేస్తూ సరఫరాకు డ్రగ్స్ సిద్ధంగా ఉన్నాయని, చార్లీ 4వేలు, ఎక్స్‌టాసీ 1000 అంటూ మెసేజ్ పెట్టిన అతడు ఎక్కడ కావాలంటే అక్కడికి డెలివరీ చేస్తానని పేర్కొన్నాడు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అతడి నుంచి 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల ఎండు గంజాయి, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కన్నీబీస్ తాగుతూ పలు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కౌస్తవ్ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. కాగా, టెక్కీ అయి ఉండీ ఎన్‌క్రిప్ట్ కాని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

More Telugu News