Pawan Kalyan: జనసేనలోకి మాజీ మంత్రి ముత్తా.. పవన్‌తో భేటీ!

  • హైదరాబాదులో పవన్ ను కలసిన ముత్తా గోపాలకృష్ణ 
  • త్వరలోనే చేరిక ముహూర్తం
  • రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తాకు చోటు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముత్తా-పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.

అనంతరం జనసేనలోకి రావాల్సిందిగా ముత్తాను పవన్ ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించారు. పార్టీలో ఆయన అధికారికంగా ఎప్పుడు చేరేది త్వరలో ప్రటించనున్నారు. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పవన్ భావిస్తున్నారు. కాగా, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తాకు ప్రత్యేక స్థానం కల్పించనున్నట్టు పవన్ ఈ సందర్భంగా తెలిపారు.  
Pawan Kalyan
Janasena
Mutha Gopalakrishna
Andhra Pradesh

More Telugu News