vijayasanthi: మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించి, మొక్కు చెల్లించుకున్న విజయశాంతి

  • తెలంగాణ వస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నా
  • ఈ రోజు మొక్కు చెల్లించుకున్నా
  • అమ్మవారి దీవెనలతో ప్రజలంతా బాగుండాలి అని కోరుకున్నా
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అమ్మవారికి పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారికి బోనాలు సమర్పించడానికి తాను వచ్చానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు బోనం ఇస్తానని అమ్మవారికి మొక్కుకున్నానని, ఈ రోజు మొక్కు తీర్చుకున్నానని తెలిపారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు ఆలయం వద్ద జనాలు ఎగబడ్డారు.
vijayasanthi
bonam

More Telugu News