PV Sindhu: శభాష్ సింధు.. ఓడినా నీవు చాలా గ్రేట్!: చంద్రబాబు ప్రశంస

షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తెలుగుతేజం పీవీ సింధు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. స్పెయిన్ క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఆమె పరాజయంపాలైంది. ఈ సందర్భంగా సింధుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.

కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, అద్భుత ప్రదర్శనను ప్రదర్శించిందని కితాబిచ్చారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ ను సాధించి భారత షట్లర్ల గొప్పదనాన్ని చాటిందని అన్నారు. ఛాంపియన్ షిప్ లో ఇప్పటి వరకు నాలుగు పతకాలు సాధించి సువర్ణాధ్యాయాన్ని సృష్టించిందని ప్రశంసించారు. వరుసగా రెండు సార్లు ఫైనల్స్ కు చేరుకుని ఘన చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు.
Go Back to Shorts
PV Sindhu
Chandrababu

More Telugu News