TG Bharat: ఇక్కడ మీరే పోటీ చేయండి.. మొత్తం సీట్లు గెలవచ్చు!: బాబుకి టీజీ భరత్ విజ్ఞప్తి

  • కర్నూలులో పోటీచేయాలని కోరిన టీజీ భరత్  
  • బాబు వస్తే 14 సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తామని విశ్వాసం
  • కుదరకుంటే సర్వే ప్రకారం సీట్లివ్వాలని విజ్ఞప్తి
కర్నూలు టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నుంచి చంద్రబాబు పోటీ చేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని భరత్ స్పష్టం చేశారు. బాబు ఇక్కడ్నుంచి పోటీ చేస్తే జిల్లాలోని 14 సీట్లను టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఒకవేళ చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేయకుంటే సర్వే ప్రకారం గెలిచేవారికే సీట్లు ఇవ్వాలని కోరారు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ వెంకటేశ్ వర్గాల మధ్య కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం పోరు కొనసాగుతోంది. ఇటీవల మంత్రి లోకేశ్ జిల్లా పర్యటన సందర్భంగా ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడంతో గొడవలు మరింత ముదిరాయి.
TG Bharat
karnool
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Nara Lokesh
tg venkatesh

More Telugu News