Tamilnadu: నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు!: పోలీసులపై కోలీవుడ్ నటి శ్రుతి సంచలన వ్యాఖ్యలు

  • విదేశీ తమిళులను మోసం చేసిన శ్రుతి
  • జైలుకు వెళ్లి వచ్చిన తరువాత సంచలన వ్యాఖ్యలు
  • పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణలు
విదేశాల్లో నివసిస్తున్న తమిళులకు తన అందాన్ని ఎరగా వేసి డబ్బు దోచుకుందన్న కేసులో అరెస్టయిన తమిళ నటి శ్రుతి, ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తోంది. గడచిన ఫిబ్రవరిలో బాలమురుగన్ అనే యువకుడి ఫిర్యాదు మేరకు శ్రుతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆపై పలువురి ఫిర్యాదు మేరకు శ్రుతి సోదరుడు సుభాష్, మరో ముగ్గురిని పోలీసులు గూండా చట్టం కింద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, తనను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించింది. కొందరు ఆగంతకులు తనకు ఫోన్ చేసి కిడ్నాప్ చేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. తాను బయటకు రావాలంటేనే భయపడుతున్నానని పేర్కొంది. పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని మహిళా సంఘాలకు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు కూడా శ్రుతి తెలిపింది.
Tamilnadu
Sruthi
Subhash
Police
Rape

More Telugu News