vijayasanthi: లాల్ దర్వాజ బోనాల్లో బోనం ఎత్తనున్న విజయశాంతి

  • రేపు బోనమెత్తనున్న విజయశాంతి
  • రాహుల్ పర్యటనలో పాల్గొనే అవకాశం
  • 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న విజయశాంతి
ప్రముఖ సినీ నటి విజయశాంతి మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ మధ్య కాలంలో ఓసారి రాహుల్ గాంధీతో సమావేశమై, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కూడా ఆమె ఎక్కడా కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో ఈనెల 13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనలో ఆమె పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, రేపు లాల్ దర్వాజలో జరిగే బోనాల్లో విజయశాంతి బోనమెత్తనున్నారు. అనంతరం భవిష్యత్ రాజకీయాలపై ఆమె ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
vijayasanthi
bonam
lal darwaja

More Telugu News