vijay devarakonda: సెన్సార్ పూర్తి .. ఆగస్టు 15న 'గీత గోవిందం'

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా 'గీత గోవిందం' చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ .. "రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించాము. అల్లు అరవింద్ ఆశీస్సులతో .. బన్నీ వాసు సహకారంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేశాము. విజయ్ దేవరకొండ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయన సినిమా నుంచి ప్రేక్షకులు కోరుకునే అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఈ సినిమాను రూపొందించాము. గోపీసుందర్ అందించిన సంగీతానికి లభించిన ఆదరణ ఆనందాన్ని కలిగిస్తోంది. యూత్ తో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.    
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News