roja: రోజా సంస్కారానికి ఇదొక నిదర్శనం!: టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు ఎద్దేవా

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మండిపడ్డారు. రోజా వాడుతున్న భాష చాలా దారుణంగా ఉంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలకు దైవ దర్శనానికి వచ్చిన సందర్భాల్లో కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు చేసే వారికి స్వామివారి దర్శనం సందర్భంగా లభించే వీఐపీ సౌకర్యాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొండమీద రాజకీయాలు మాట్లాడటమే కాకుండా... నగరి సీఐని రాయలేని భాషలో తిట్టడం రోజా సంస్కారానికి నిదర్శనమని చెప్పారు.

వేల మంది రోజాలు, అంబటి రాంబాబులు వచ్చినా 2019లో చంద్రబాబు విజయాన్ని ఆపలేరని శ్రీనివాసులు అన్నారు. 2019లో చంద్రబాబు మరోసారి సీఎం కావడం ఖాయమని చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి ఎక్కడి నుంచో వచ్చిన చంద్రమౌళి కులాలు, మతాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 
Go Back to Shorts
roja
mal srinivasulu
Chandrababu

More Telugu News