sameer: బాలకృష్ణ గారికి కొంచెం కోపం ఎక్కువని నన్ను భయపెట్టారు: నటుడు సమీర్

  • బాలకృష్ణగారితో కలిసి నటించాను 
  • ఆయన చాలా సరదా మనిషి 
  • వర్క్ విషయానికే వస్తే చాలా సిన్సియర్
బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో సమీర్ వెండితెరకి వెళ్లాడు. అక్కడ ఆయన విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో .. బాలకృష్ణతో నటిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అప్పుడు ఆయన స్పందిస్తూ .. "బాలకృష్ణగారితో రెండు సినిమాలు చేశాను. ఫస్టు టైమ్ ఆయనతో చేస్తున్నప్పుడు .. ఆయనతో కాస్త జాగ్రత్తగా వుండాలని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. ఆయనకి కొంచెం కోపం ఎక్కువ అని భయపెట్టారు.

ఆయనతో మాట్లాడిన తరువాత నాకు తెలిసింది .. ఆయన ఎంత సరదా మనిషి అనేది. సెట్లో ఒక మూలన సైలెంట్ గా కూర్చునే వాళ్లంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన సరదాగా వుంటారు .. మిగతా వాళ్లు అలా ఉండాలనే కోరుకుంటారు. ఇక వర్క్ విషయానికొస్తే ఆయన ఎంత సిన్సియర్ గా వుంటారో .. మిగతా వాళ్లూ అలా ఉండాలనే ఆశిస్తారు" అని చెప్పుకొచ్చాడు.  
sameer
balakrishna

More Telugu News