GST Council Meet: నేడు జీఎస్టీ కౌన్సిల్ 29వ సమావేశం.. గుడ్ న్యూస్ వినిపించే అవకాశం!

  • ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం
  • పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం
  • జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు, డీజిల్
కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నేడు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 29వ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా సిమెంట్, ఏసీ, పెద్ద టెలివిజన్లు తదితర వాటి ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఒకవేళ అదే జరిగితే చమురు కంపెనీలకు ఉపశమనం లభిస్తుంది.  

చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రభావం చూపే వాటిపైనా జీఎస్టీ తగ్గించే అవకాశం గురించి కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే జీఎస్టీని మరింత సరళతరం చేయడంపైనా దృష్టి సారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న ట్రాక్టర్లు, ట్రాక్టర్ విడిభాగాలు, ఎగ్ ట్రేలు, మూవీ టికెట్లు, పాత్రలు, తక్షణం లభ్యమయ్యే ఆహారం, బ్రేక్‌ఫాస్ట్‌కు అవసరమైన వాటిపై జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి వీటిపైనా కౌన్సిల్ చర్చించే అవకాశం ఉంది.  
GST Council Meet
MSME sector
Finance Minister
Piyush Goyal

More Telugu News