Kurnool District: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ క్వారీలో బ్లాస్ట్.. పలువురి మృతి

  • హత్తిబెళగళ్ లోని మైనింగ్ క్వారీలో బ్లాస్టింగ్
  • బండరాళ్లు మీద పడి 9 మంది కార్మికులు మృతి
  • మృతులందరూ ఒడిశా వాసులే
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆలూరు మండలం హత్తిబెళగళ్ లోని మైనింగ్ క్వారీలో ఈరోజు రాత్రి బ్లాస్టింగ్ నిర్వహించారు. అయితే, బండరాళ్లు మీద పడటంతో 9 మంది కార్మికులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతులందరూ ఒడిశా వాసులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్టు సమాచారం.

బ్లాస్టింగ్ ధాటికి క్వారీలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న రెండు షెడ్లు, ఒక లారీ, మూడు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. షెడ్డులో మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, భారీ శబ్దాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు.
Kurnool District
mining

More Telugu News