karunanidhi: కరుణానిధిని పరామర్శించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్

  • ఈ నెల 5న చెన్నైకు రామ్ నాథ్ కోవింద్
  • కావేరి ఆసుపత్రిలో కరుణను కలవనున్న కోవింద్
  • ప్రస్తుతం నిలకడగా ఉన్న కరుణానిధి ఆరోగ్యం
ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పరామర్శించనున్నారు. ఈ నెల 5న రామ్ నాథ్ చెన్నై వెళ్లనున్నారు. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణను పరామర్శిస్తారని చెన్నైలోని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

కాగా కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఇతర రాష్ట్రాల నేతలు ఇప్పటికే పరామర్శించారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోలుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
karunanidhi
ramnath

More Telugu News