somu veerraju: చంద్రబాబు విషయంలో ఏం చేస్తున్నారు?: గవర్నర్ ను ప్రశ్నించిన సోము వీర్రాజు

  • చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారు
  • ఆయన అవినీతికి పంచభూతాలే సాక్ష్యం
  • చంద్రబాబును బర్తరఫ్ చేసే అంశాన్ని గవర్నర్ పరిశీలించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఎయిర్ పోర్టులకు సేకరించిన భూమిని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. చివరకు స్కూలు భవనాలకు రంగులు వేసే పనుల్లో కూడా అవినీతి జరుగుతోందని మండిపడ్డారు.

చంద్రబాబు చేస్తున్నదంతా భగవంతుడు చూస్తున్నాడని, ఆయన అవినీతికి పంచభూతాలే సాక్ష్యాలని చెప్పారు. చంద్రబాబు ఇంత అవినీతికి పాల్పడుతుంటే గవర్నర్ నరసింహన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
somu veerraju
Chandrababu
governor

More Telugu News