terrotists: భారత్ లో చొరబడేందుకు సరిహద్దుల్లో వేచిచూస్తున్న 600 మంది ఉగ్రవాదులు

  • నియంత్రణ రేఖ సమీపంలో పలు స్థావరాల్లో ముష్కరులు
  • కశ్మీర్ లో కల్లోలం సృష్టించడమే వీరి లక్ష్యం
  • కేంద్ర హోం శాఖకు నివేదిక అందించిన నిఘా వర్గాలు
పాక్ భూభాగం నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఏకంగా 600 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న పలు స్థావరాల్లో వీరు ఉన్నారని... భారత్ లోకి అడుగు పెట్టేందుకు అదను కోసం వేచి చూస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ఓ నివేదికను అందించాయి. కశ్మీర్ లో కల్లోలం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలిపాయి. వీరికి పాక్ సైన్యం అండదండలు ఉన్నాయని చెప్పింది. ఉగ్రవాదులను ఏరి వేసేందుకు భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టిన తర్వాత... ఇంత భారీ సంఖ్యలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధం కావడం ఇదే ప్రథమం. పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలను స్వీకరించబోతున్న తరుణంలో... సైన్యం అండతో ఉగ్రవాదులు భారత్ పై కాలుదువ్వుతుండటం గమనార్హం.
terrotists
pakistan
line of control
kashmir

More Telugu News