kapu: నేడు లోక్‌సభలో కాపు రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు

  • ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనున్న టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్
  • రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయాలన్న ఎంపీ 
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించాలంటూ డిమాండ్
కాపు రిజర్వేషన్లపై ఈరోజు లోక్ సభలో టీడీపీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు.

కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీలో వేడిని పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ చెబుతోంది. కేంద్రం చేతిలో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని తాము ఏమీ చేయలేమని చెప్పిన వైసీపీ అధినేత జగన్... తాము అధికారంలోకి వస్తే కాపుల సంక్షేమానికి రూ. 10 వేల కోట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  
kapu
reservations
Lok Sabha
private bill
avanthi srinivas
Telugudesam

More Telugu News