Allu Arjun: 'సభకు నమస్కారం' లేదన్న దిల్ రాజు!

  • అల్లు అర్జున్ హీరోగా కొత్త చిత్రం
  • నిర్మాత దిల్ రాజు అంటూ పుకార్లు
  • అసత్యమని క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తరువాత తాను నిర్మాతగా 'సభకు నమస్కారం' అనే చిత్రాన్ని అల్లు అర్జున్ చేయబోతున్నాడని గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. ఈ వార్తలు అసత్యమని స్పష్టం చేశాడు. తాను కూడా సామాజిక మాధ్యమాల్లో, వెబ్ సైట్లలో రెండు రోజులుగా ఈ వార్తను వింటున్నానని, ఇందులో నిజం లేదని అన్నాడు.

 ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపాలని సూచించిన ఆయన, ప్రస్తుతం తాను నితిన్‌ తో 'శ్రీనివాస కళ్యాణం' చేశానని, మహేష్ బాబు 25వ చిత్రం ఒక్కటే సెట్స్ పై ఉందని, మరే చిత్రమూ తన చేతుల్లో లేదని చెప్పాడు. ఇలాంటి వార్తలను దయచేసి పుట్టించవద్దని విజ్ఞప్తి చేసిన దిల్ రాజు, తాను నిర్మాతగా ఏదైనా సినిమా అనుకుంటే, వెంటనే తెలియజేస్తానని చెబుతూ 'సభకు నమస్కారం' పెట్టేశారు.
Allu Arjun
Dil Raju
Sabhaku Namaskaram

More Telugu News