santhosh sobhan: 'పేపర్ బాయ్' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది

  • మరో ప్రేమకథా చిత్రంగా 'పేపర్ బాయ్'
  • నిర్మాతగా మారిన సంపత్ నంది
  • దర్శకుడిగా జయశంకర్  
ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని ప్రేమకథా చిత్రాలకు కుర్రాళ్లంతా నీరాజనాలు పట్టారు .. విజయాన్ని కట్టబెట్టారు. దాంతో మరికొన్ని ప్రేమకథలు వాళ్లను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోన్న ప్రేమకథా చిత్రాలలో ఒకటిగా 'పేపర్ బాయ్' కనిపిస్తోంది.

సంపత్ నంది నిర్మిస్తోన్న ఈ సినిమాకి జయశంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 4 గంటలకు 'చినుకై కురిసింది' అనే పాటను సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియజేస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, రియా సుమన్ .. తాన్యా హోప్ కథానాయికలుగా కనిపించనున్నారు.   
santhosh sobhan
riya
thanya

More Telugu News