nelamangala: బెంగళూరు శివారులో రోడ్డు ప్రమాదాలు.. 6 నంబర్ అంటేనే బెంబేలెత్తిపోతున్న వాహనదారులు!

  • నెలమంగళ జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు
  • ప్రమాదానికి గురైన 20 వాహనాల్లో 19 వాహనాల చివరి నెంబర్ 6
  • చివరి నెంబర్ 6 ఉన్న వాహనదారుల్లో భయాందోళనలు
బెంగళూరు నగర శివార్లలో ఉన్న నెలమంగళ జాతీయ రహదారిపై ఇటీవలి కాలంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇదెక్కడి విచిత్రమో కానీ... ప్రమాదానికి గురవుతున్న వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో చివరి నంబర్ 6గా ఉంటోంది. ప్రమాదాలకు గురైన 20 వాహనాల్లో 19 వాహనాల చివరి నంబర్ 6గా ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్ అవుతోంది. దీంతో, చివరి నంబర్ 6 ఉన్న వాహనదారులంతా అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారట. అయితే, నంబర్లో ఏమీ లేదని, డ్రైవింగ్ లో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. 
nelamangala
accidents
number 6

More Telugu News