నందితా శ్వేత కథానాయికగా 'ప్రేమకథా చిత్రం 2'
- గతంలో హిట్ కొట్టిన హారర్ కామెడీకి సీక్వెల్
- సుమంత్ అశ్విన్ జోడీగా నందితా శ్వేత
- త్వరలో రెండవ షెడ్యూల్ షూటింగ్
సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన నందితా శ్వేతను తీసుకున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో, దెయ్యం పాత్రలో అదరగొట్టేసిన కారణంగానే ఈ అమ్మాయికి ఈ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలోనూ ఈ అమ్మాయి నటన హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. రీసెంట్ గా మొదటి షెడ్యూలను పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ నెల రెండవ వారం నుంచి రెండవ షెడ్యూల్ ను ఆరంభించనుంది. 'జంబ లకిడి పంబ' ఫేమ్ సిద్ధి ఇద్నాని ఈ సినిమాలో మరో కథానాయికగా నటిస్తోంది.