vijay antony: మోషన్ టీజర్ తోనే దుమ్మురేపేసిన 'రోషగాడు'

షార్ట్స్‌లో చూడండి
విజయ్ ఆంటోని సినిమా అనగానే కథాకథనాలు .. పాత్రలను మలిచే విధానం కొత్తగా వుంటాయని ప్రేక్షకులు భావిస్తుంటారు. ఆయన సినిమాలు సాధించిన విజయాల సంగతి అటుంచితే, వేటికవే వైవిధ్యభరితమైనవిగా అనిపిస్తాయి. అందువల్లనే ఆయన నుంచి ఏ సినిమా వస్తుందన్నా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఆయన తాజా చిత్రంగా తమిళంలో 'తిమిరు పిడిచ్చవన్' చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'రోషగాడు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి తాజాగా మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. 'ఒళ్లంతా పొగరురా .. పొగరుకే మొగుడురా .. మాట పడని 'రోషగాడు'రా .. అంటూ ఈ టీజర్ ను వదిలారు. యాక్షన్ ప్రధానంగా వదిలిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Go Back to Shorts
vijay antony

More Telugu News