Chittoor: 'మాయల ఫకీరు' అవతారమెత్తిన టీడీపీ ఎంపీ!

  • రోజుకో వేషంతో వస్తున్న శివప్రసాద్
  • నేడు పార్లమెంట్ ముందుకు మాయల ఫకీరు వేషంలో
  • హోదా ఇవ్వకుంటే మోదీని మాయం చేస్తానన్న ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోజుకో వేషం వేసుకుని వచ్చి నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ ఎన్. శివప్రసాద్, నేడు మాయల ఫకీరు వేషంలో వచ్చారు. చేతిలో మంత్రదండంతో వచ్చిన ఆయన, ప్రధాని మోదీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు వేశారు.

ఇతర తెలుగుదేశం ఎంపీలతో కలసి పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు ఆయన నిరసనకు దిగారు. రాష్ట్రానికి హోదాను ఇవ్వని నరేంద్ర మోదీని మాయం చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఈ సందర్భంగా శివప్రసాద్ వ్యాఖ్యానించారు. తన మంత్రదండం రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కనీయకుండా చేస్తుందని అన్నారు. టీడీపీ ఎంపీలు మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ తదితరులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
Chittoor
Siva Prasad
Mayala Phakir
Parliament
Narendra Modi

More Telugu News