పోలవరం పూర్తయితే భద్రాచలానికి ప్రమాదం: సుప్రీంలో తెలంగాణ
- బొగ్గు గనులున్న ప్రాంతాలకూ ముప్పుంది
- సమగ్ర సర్వే చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలి
- సుప్రీంకోర్టులో తెలంగాణ అఫిడవిట్
ఈ ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ వేగం వస్తుందన్న అంచనాతో నిర్మిస్తున్నారని చెబుతున్న తెలంగాణ, గోదావరిలో అంత ప్రవాహం వస్తే, భద్రాచలం, మణుగూరు తదితర ప్రాంతాలు తీవ్రమైన ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ రాష్ట్ర భూభాగం, ఇక్కడి ప్రజల మనోభావాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, మరోసారి సర్వే చేసి తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.