Andhra Pradesh: ఏపీ సీఎస్ దినేష్ కుమార్ తో భేటీ అయిన కోస్ట్ గార్డ్ డీఐజీ!

  • ఇటీవలే కోస్ట్ గార్డ్ డీఐజీగా భాద్యతలు 
  • సీఎస్ తో మర్యాదపూర్వక భేటి 
  • తీరప్రాంత రక్షణ గురించి చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ను కోస్ట్ గార్డ్ డీఐజీ నవదీప్ రాజ్ ఈరోజు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కోస్ట్ గార్డ్ డీఐజీగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు సీఎస్ దినేష్ కుమార్ కు నవదీప్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా తీరప్రాంత రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఇరువురూ చర్చించారు.
Andhra Pradesh
cs
dineshkumar

More Telugu News