Vijayawada: కాంగ్రెస్ లో చేరిన తరువాత తొలిసారి విజయవాడకు కిరణ్ కుమార్ రెడ్డి... ఘనస్వాగతం!

  • రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ కు దూరమైన నల్లారి
  • ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం
  • నేడు కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేత
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, విభజనను తీవ్రంగా వ్యతిరేకించి, కాంగ్రెస్ ను వీడి, ఇటీవల తిరిగి సొంత గూటికి చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఉదయం విజయవాడలో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ లో చేరిన తరువాత ఆయన తొలిసారిగా విజయవాడకు రాగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దనేకుల మురళీమోహన్‌, పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.

 ఆపై గన్నవరం నుంచి విజయవాడకు వెళ్లి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వర్షాలు, పంటలపై ఆరా తీసిన కిరణ్ కుమార్ రెడ్డి, వర్షాలు కురవకుంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. కాసేపట్లో ఆయన ఆంధ్ర రత్న భవన్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు.
Vijayawada
Nallari Kirankumar Reddy
Andhra Pradesh
Welcome

More Telugu News