Bihar: బోరు బావిలో మూడేళ్ల బాలిక... 48 అడుగుల లోతు నుంచి రోదన!

  • బీహార్ లోని ముంగేర్ జిల్లాలో ఘటన
  • ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన చిన్నారి
  • సహాయక చర్యలు ప్రారంభం
మరో చిన్నారి బోరు బావిలో పడింది. బీహార్ లోని ముంగేర్ జిల్లాలో 225 అడుగుల లోతున్న బోరు బావిలో మూడు సంవత్సరాల బాలిక ఆడుకుంటూ వెళ్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో పాప బావిలో పడిపోగా, వెంటనే భగల్ పూర్ నుంచి అధికారులు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

బాలిక సుమారు 48 అడుగుల లోతులో ప్రాణాలతోనే ఉందని గుర్తించిన సిబ్బంది, ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు. పాప రోదనలు బయటకు వినిపిస్తున్నాయని, సీసీ కెమెరాలను పంపి పాపను గమనిస్తున్నామని వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా పాపను బయటకు తీసేందుకు 'ఎల్' ఆకారంలో గొయ్యి తవ్వుతున్నామని తెలిపారు. తొలుత 32 అడుగుల లోతుకు నిలువునా గుంత తీసి, ఆపై 16 అడుగుల దూరాన్ని అడ్డంగా తవ్వనున్నామని తెలిపారు.
Bihar
Borewell
Falls
Rescue

More Telugu News