India: ఉపఖండానికి పెను నష్టం కలిగించనున్న భారీ భూకంపాలు: రీసెర్చర్ల హెచ్చరిక

  • నాలుగు ముక్కలు కానున్న ఇండియన్ టెక్టానిక్ ప్లేట్
  • టిబెట్ పీఠభూమి కింద 160 కిలోమీటర్ల లోతున మార్పులు
  • ప్రపంచంలోనే అత్యంత భయంకర భూకంపాలకు అవకాశం
  • హెచ్చరించిన రీసెర్చర్లు

భారత ఉప ఖండానికి పెను భూకంపాల నుంచి ముప్పుందని, టిబెట్ పీఠం కింద ఉన్న ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టుకోనుండటమే ఇందుకు కారణమని రీసెర్చర్లు హెచ్చరించారు. దాదాపు 5 లక్షల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగాల్లో ఇవి ఢీకొట్టుకున్న వేళ, పెను భూకంపాలు సంభవించాయని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ జియోలజీ ప్రొఫెసర్ జియోడాంగ్ తెలిపారు.

ఇప్పుడు ఇండియన్, ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు తూర్పు ఆసియా స్వరూపాన్ని మార్చనున్నాయని, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపాలు సంభవించే ప్రమాదముందని తన తాజా అధ్యయనంలో తెలిపారు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నాలుగు ముక్కలుగా విడిపోనుందని తమ అధ్యయనంలో తేలినట్టు చెప్పారు. పలు మార్గాల నుంచి తాము భూ భౌతిక సమాచారాన్ని సేకరించామని, టిబెట్ పీఠభూమికి 160 కిలోమీటర్ల లోతున జరుగుతున్న పరిణామాలను టోమోగ్రాఫిక్ విధానంలో చిత్రాలు తీశామని ఆయన తెలిపారు.

More Telugu News