TTD: మేం అధికారంలోకి వస్తే, రమణ దీక్షితులుకు తిరిగి బాధ్యతలు: వైసీపీ

  • రమణ దీక్షితులుతో భూమన భేటీ
  • అరగంటకు పైగా సాగిన సమావేశం
  • జగన్ రాగానే అర్చకుల పదవీ విరమణ నిబంధనలు తొలగింపు
  • టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీ విరమణ పేరిట తొలగించిన రమణ దీక్షితులును తిరిగి విధుల్లోకి తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. జగన్ సీఎం కాగానే జరిగే తొలి పాలకమండలి సమావేశంలో వయస్సు కారణంగా తొలగించిన ముగ్గురు అర్చకులను విధుల్లోకి తీసుకోవడమే అజెండా అని వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

నిన్న సాయంత్రం తిరుమల మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులుతో అరగంటకు పైగా సమావేశమైన ఆయన, ఆపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అర్చకులకు పదవీ విరమణ వయసు అన్నది లేకుండా చేస్తామని ఆయన అన్నారు. టీటీడీ బోర్డు పలు నిర్ణయాలను అక్రమంగా తీసుకుందని ఆరోపించిన ఆయన, అర్చకులను తొలగించడం తనకు బాధను కలిగించిందని వ్యాఖ్యానించారు.
TTD
YSRCP
Ramanadeekshitulu
Bhumana
Tirumala

More Telugu News