kambhampati Haribabu: విశాఖకు రైల్వేజోన్ వచ్చి తీరుతుంది: కంభంపాటి హరిబాబు ధీమా

  • గోయల్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
  • త్వరలోనే విశాఖకు రైల్వే జోన్
  • చిత్తశుద్ధిని శంకించొద్దన్న హరిబాబు
విశాఖపట్టణానికి త్వరలోనే రైల్వే జోన్ వస్తుందని బీజేపీ నేత, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. మంగళవారం పార్టీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్‌తో కలిసి కేంద్రమంత్రి గోయల్‌ను కలిసి రైల్వే జోన్‌ గురించి చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు, బీజేపీ పార్లమెంటరీ భేటీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఏపీ అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా పేరు లేకపోయినప్పటికీ రాష్ట్రానికి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హోదా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
kambhampati Haribabu
Visakhapatnam District
Railway zone
Andhra Pradesh

More Telugu News