Jagan: జగన్ తో కలిసి నడిచిన సినీ నటులు విజయ్ చందర్, పృథ్వీరాజ్

  • తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగిన జగన్ పాదయాత్ర
  • విరవలో జగన్ ని కలిసిన సినీ నటులు
  • జగన్ వెన్నంటే ఉంటానన్న పృథ్వీరాజ్
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ ను ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్, సీనియర్ నటుడు విజయ్ చందర్ కలిశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఈ నియోజకవర్గంలోని విరవ నుంచి ఈరోజు ఉదయం ప్రారంభమైన పాదయాత్రలో జగన్ తో కలిసి వారు నడిచారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకూ జగన్ వెన్నంటే ఉంటానని చెప్పారు. విజయ్ చందర్ మాట్లాడుతూ, జగన్ సీఎం అయితేనే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని సంక్షేమ పథకాలు మళ్లీ అమలు అవుతాయని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. జగన్ ని ‘నడిచొచ్చే నమ్మకం’గా ప్రజలు భావిస్తున్నారని  అన్నారు.
Jagan
Prudhvi Raj
vijay chander

More Telugu News