Chandrababu: నన్ను ఎంత తొక్కితే అంతగా ఎదుగుతా: రోజా

  • నాపై నమోదైన కేసుపై బాబు, లోకేష్ లు శ్రద్ధ పెట్టారు
  • నన్ను లోపల పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు
  • నా ప్రాణం పోయేంత వరకూ నా పోరాటం ఆపను
తనపై లేనిపోని కేసులు బనాయించి, తనను జైల్లో పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాపై పోలీస్ కేసు నమోదు కావడంపై ఆమె స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనపై నమోదైన ఈ కేసుపై చంద్రబాబు, లోకేష్ లు శ్రద్ధ పెట్టారని, ఎలాగైనా సరే, తనను లోపల పెట్టాలన్న ఆలోచనలో వారు ఉన్నారన్న సమాచారం తమకు తెలిసిందని అన్నారు.

గతంలో కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీలో గట్టిగా నిలదీసినందుకు నిర్దాక్షణ్యంగా తనను సస్పెండ్ చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ‘నా ప్రాణం పోయేంత వరకూ నా పోరాటం ఆపను. నన్ను ఎంత తొక్కితే అంతగా ఎదుగుతాను. మహిళల సమస్యలపై గళం విప్పుతాను అని చంద్రబాబునాయుడికి చెబుతున్నా’ అని రోజా ఆవేశంగా అన్నారు.
Chandrababu
roja

More Telugu News