nitin gadkari: రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది: నితిన్ గడ్కరీ

  • ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏపీకి అన్నీ ఇస్తున్నాం
  • హోదా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • విపక్ష పార్టీలన్నీ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నాయి
ఏపీకి పత్యేక హోదా ఇవ్వక పోయినా అన్నీ చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఏపీకి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరుగుతోందని విమర్శించారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. విపక్ష పార్టీలన్నీ కలసి కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానం చాలా బాగుందని కొనియాడారు.
nitin gadkari
special status
visakhapatnam
railway zone

More Telugu News