Aditi Rao Hydari: నటి అదితీరావు సంచలన వ్యాఖ్యలు.. తానూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ఆవేదన!

  • 8 నెలలపాటు చేతిలో పని నిల్
  • అయినా, క్యాస్టింగ్ కౌచ్‌కు నో
  • సత్తా ఉంటే అవకాశాలు అవే వస్తాయన్న అదితి
బాలీవుడ్ నటి అదితీరావు హైదరి (31) సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లో కుదురుకునేందుకు పడిన కష్టాలను ఏకరవు పెట్టింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, అయితే వాటన్నింటినీ అధిగమించానని తెలిపింది. చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను ఎలా చూస్తారో తెలిసి కొన్నిసార్లు ఏడుపొచ్చిందని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్‌కు నో చెప్పినందుకు కొన్ని నెలలపాటు తనకు అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ సమయంలో తాను ఏడ్చేశానని, నిస్సహాయత ఆవరించిందని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి తనతో మాట్లాడడానికి వారికెంత ధైర్యం అనుకునే దానినని పేర్కొన్న అదితి దాదాపు 8 నెలలుపాటు ఖాళీగా ఉన్నట్టు చెప్పింది. చేతిలో ఏ సినిమా లేకున్నా తాను తీసుకున్న నిర్ణయం (క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా) తనను మరింత బలంగా తయారుచేసిందని వివరించింది. సినీ పరిశ్రమలో పవర్ ప్లే నడుస్తుంటుందని, దాని వలలో అమ్మాయిలు పడకూడదని హెచ్చరించింది. నిజంగా మనలో సత్తా ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని తెలిపింది.

అదితి తన సినీ కెరియర్‌ను 2006లో మలయాళంలో ‘ప్రజాపతి’ సినిమాతో ప్రారంభించింది. అయితే, 2011లో వచ్చిన ‘యె సాలీ జిందగీ’ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన అదితి నటించిన తమిళ సినిమా ‘చెక్కా చివంత వానమ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Aditi Rao Hydari
Bollywood
casting couch
Actress

More Telugu News