CM Ramesh: సీఎం రమేష్ పై మళ్లీ మండిపడ్డ వరదరాజులురెడ్డి!

  • మా వర్గం కౌన్సిలర్లను రమేష్ డబ్బు పెట్టి కొన్నారు
  • వైసీపీ ఎమ్మెల్యేతో రమేష్ టచ్ లో ఉన్నారు
  • రమేష్ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు
కడప టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పై అదే పార్టీ నేత వరదరాజులు రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దయతో రమేష్ ఎంపీ అయ్యారని, రమేష్ గ్రామస్థాయికి ఎక్కువ, మండల స్థాయికి తక్కువ అని విమర్శించారు. తన వర్గం కౌన్సిలర్లను రమేష్ డబ్బు పెట్టి కొన్నారని, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డితో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలు చేస్తున్న సీఎం రమేష్.. టీడీపీ గెలుపు అవకాశాలను చెడగొడుతున్నారని ఆరోపించారు.
CM Ramesh
varadarajulu reddy

More Telugu News