rajanikanth: రేపు కరుణానిధిని పరామర్శించనున్న రజనీకాంత్

షార్ట్స్‌లో చూడండి
డీఎంకే అధినేత కరుణానిధిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ డెహ్రాడూన్ పర్యటనలో ఉన్నారు. రజనీ తన పర్యటన ముగించుకుని రేపు చెన్నైకు చేరుకోనున్నారు. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించేందుకు రేపు మధ్యాహ్నం అక్కడికి వెళతారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సామాజిక మాధ్యమాల వేదికగా కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. ఈ వదంతులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 13 మందిని విచారించారని, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం.
Go Back to Shorts
rajanikanth
karunanidhi

More Telugu News