Telugudesam: టీడీపీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చిన జీవీఎల్

  • రాజ్యసభలో నేను ప్రసంగించాక టీడీపీ నేతలు బెదిరించారు
  • ‘ఖబడ్డార్..’ అని బెదిరింపులకు పాల్పడ్డారు
  • వీడియో ఆధారాలను అందజేసిన జీవీఎల్?  
టీడీపీ నేతలు తనను బెదిరించారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ మేరకు టీడీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. రాజ్యసభలో తాను ప్రసంగించిన తర్వాత టీడీపీ నేతలు ఈ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘ఖబడ్డార్ .. తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ టీడీపీ నేతలు తనను బెదిరించారని ఆ నోటీస్ లో పేర్కొన్నట్టు సమాచారం.

టీడీపీ నేతలు తనను హెచ్చరిస్తున్న వీడియో ఆధారాలను రాజ్యసభ సెక్రటేరియట్ కు జీవీఎల్ అందజేసినట్టు తెలుస్తోంది. టీడీపీ వైఫల్యాలను రాజ్యసభ వేదికగా ఎండగట్టడంతోనే తనను టీడీపీ నేతలు బెదిరించారని జీవీఎల్ అన్నట్టు తెలుస్తోంది.
Telugudesam
bjp

More Telugu News