KTR: కాంగ్రెస్-టీడీపీలు కలుస్తాయట.. సింహం మాత్రం సింగిల్ గానే వస్తుంది!: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
'రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కలసి పోటీ చేస్తాయట' అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంత మంది కలిసినా టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేరని ఆయన అన్నారు. సింహం ఎప్పుడూ సింగిల్ గానే వస్తుందని, రానున్న ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే కేసీఆర్ చేసిన పనులకు సార్థకత ఉంటుందని అన్నారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
KTR
kcr
TRS
congress

More Telugu News