Jogini: ప్రభుత్వంపై జోగిని శ్యామల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తలసాని శ్రీనివాస యాదవ్!

  • నిన్న జాతర సందర్భంగా మహిళలకు ఇబ్బందులు
  • సంచలన వ్యాఖ్యలు చేసిన జోగిని శ్యామల
  • ప్రభుత్వంపై కామెంట్ సరికాదన్న తలసాని
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా జోగిని శ్యామల చేసిన సంచలన వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు. జోగినిగా ఉన్న శ్యామలకు ఆలయం పరిసరాలు, ఇక్కడి స్థలాభావం, పరిస్థితులన్నీ తెలుసునని, వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్నందునే సాధారణ భక్తులకు ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వంపై ఆమె కామెంట్ చేయడం సరికాదని అన్నారు. ప్రజలు చల్లగా ఉండాలని కోరుకోవాల్సిన వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.

కాగా, క్యూలైన్లలో పది, పదిహేను కిలోలకు పైగా బరువైన బోనంతో ఉన్న మహిళలను గంటల తరబడి వేధించారని, మంత్రులు, ఎమ్మెల్యేల కోసమే అయితే తాము గుడికి రామని శ్యామల ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బోనంతో వచ్చిన తనను, శివసత్తు అని కూడా చూడకుండా గుండెలపై చేతులేసి నెట్టేశారని ఆరోపించిన శ్యామల, ఇదేనా పోరాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పడిపోతుందని శాపనార్థాలు పెట్టారు.
Jogini
Syamala
Bonalu
Talasani

More Telugu News