నా బోనం నాకిచ్చి మీరేంటి నన్నడిగేది?: భవిష్యవాణిలో అమ్మ ఆగ్రహం
- బంగారు బోనంతో సంతోషించావా?
- రంగంలో అమ్మను ప్రశ్నించిన పూజారి
- తన బోనమే కదా అన్న అమ్మవారు
తన బోనాన్నే తనకు ఇచ్చారే తప్ప కొత్తగా ఏం చేశారని అడిగింది. ఈ సంవత్సరం ఉత్సవాలు తనకు సంతోషాన్ని కలిగించలేదని వ్యాఖ్యానించింది. ఇంత ఘనంగా ఉత్సవాలు చేస్తే... సంతోషం లేదని ఎలా చెబుతావమ్మా? అని అడుగగా, తనను ప్రశ్నించడానికి నువ్వెవరని అమ్మ గద్దించేసరికి అక్కడున్న భక్తులంతా నివ్వెరపోయారు.