Secunderabad: నా బోనం నాకిచ్చి మీరేంటి నన్నడిగేది?: భవిష్యవాణిలో అమ్మ ఆగ్రహం

  • బంగారు బోనంతో సంతోషించావా? 
  • రంగంలో అమ్మను ప్రశ్నించిన పూజారి
  • తన బోనమే కదా అన్న అమ్మవారు
తన బోనాన్ని తనకు సమర్పించి సంతృప్తి చెందావా? అని ప్రశ్నించడం ఏంటని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో, అమ్మవారిని తనలోకి ఆవహింపజేసుకుని రంగం వినిపించిన స్వర్ణలత ప్రశ్నించింది. ఈ సంవత్సరం బంగారు బోనాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేసిన ఆలయ ప్రధాన పూజారి, సంతృప్తి చెందావా అమ్మా? అని ప్రశ్నించగా, స్వర్ణలత పై వ్యాఖ్యలు చేసింది.

 తన బోనాన్నే తనకు ఇచ్చారే తప్ప కొత్తగా ఏం చేశారని అడిగింది. ఈ సంవత్సరం ఉత్సవాలు తనకు సంతోషాన్ని కలిగించలేదని వ్యాఖ్యానించింది. ఇంత ఘనంగా ఉత్సవాలు చేస్తే... సంతోషం లేదని ఎలా చెబుతావమ్మా? అని అడుగగా, తనను ప్రశ్నించడానికి నువ్వెవరని అమ్మ గద్దించేసరికి అక్కడున్న భక్తులంతా నివ్వెరపోయారు.
Secunderabad
Rangam
Bonam
Swarnalatha

More Telugu News