'ఎన్టీఆర్' బయోపిక్ లో విద్యాబాలన్.. హాట్ టాపిక్‌గా మారిన పారితోషికం!
- ‘ఎన్టీఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో విద్యాబాలన్
- కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు
- టాలీవుడ్లో చర్చనీయాంశం
ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకంగా బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ నటిస్తోంది. బాలకృష్ణ పట్టుబట్టి మరీ విద్యాబాలన్‌ను ఆ పాత్రకు ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చారు. షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమెకు బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త విషయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌కు ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారన్నదే ఆ వార్త. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన ఆమెకు అంత రెమ్యునరేషనా? అంటూ టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క ఆమెకే అంత చెల్లిస్తే మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుందన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.