Telugudesam: ఆ ఇద్దరు హీరోలంటే ఇష్టం: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • అమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం
  • నటుడిగా ఎన్టీఆర్ హావభావాలు అద్భుతం
  • క్రీడల్లో క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడతా
లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా హిందీలో ప్రసంగించి గడగడలాడించిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుపై ప్రశంసల వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఏ టాపిక్ మీదైనా అనర్గళంగా మాట్లాడగలిగే ఈయన, ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్ లోనూ తన సత్తా చాటేవాడట. ఆ విషయాన్ని తనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

క్రీడల్లో క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడటమంటే చాలా ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం తనకు తీరిక లేదు కనుక క్రికెట్ ఆడే సమయం దొరకడం లేదని, ఒకప్పుడైతే ఎంత ఎండలోనైనా సరే, ఆడేందుకు వెళ్లిపోయేవాడినని అన్నారు. ఈ సందర్భంగా తనకు నచ్చే హీరోల గురించీ ప్రస్తావించారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్.. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమని చెప్పారు. వీరి నటన చాలా బాగుంటుందని అన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తన జీవితంలో ఎదిగిన క్రమం, ఓ నటుడిగా ఆయన హావభావాలు అద్భుతమని ప్రశంసించారు. అలాగే డ్యాన్ బ్రౌన్ నవలలు అంటే తనకు ఇష్టమని చెప్పారు. ఫొటోగ్రఫీ తన హాబీ అని, భారత్ లో హిమాలయ ప్రాంతాలు, విదేశాల్లో అయితే న్యూయార్క్ సిటీ తనకు నచ్చే పర్యాటక ప్రాంతాలని రామ్మోహన్ నాయడు చెప్పారు.
Telugudesam
ram mohannaidu
junior ntr

More Telugu News