‘తెలంగాణ’లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ‘కాంగ్రెస్’కే అధికారం: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ సర్వేలో తేలిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శివారు బోడుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు. ఈ సభకు ఉత్తమ్, సర్వే సత్యనారాయణ తదితర నేతలు హాజరయ్యారు. ఉత్తమ్ సమక్షంలో టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ తన కుటుంబానికి అనుకూలంగా వ్యవస్థను మార్చుకున్నారని, తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబంలోని నలుగురు మాత్రమే సంతోషంగా ఉన్నారని విమర్శించారు. దోచుకోవడం-దాచుకోవడమే కేసీఆర్ కుటుంబం పని అని ఆరోపించారు.


More Telugu News