Hyderabad: బంగారు బోనం ఎత్తుకున్న కవిత!

  • అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి జాతర
  • బంగారు బోనాన్ని అనుసరించిన 1008 బోనాలు
  • భక్తులను నియంత్రించేందుకు పోలీసుల ఇబ్బందులు
ఉజ్జయిని మహంకాళి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుండగా, నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఈ ఉదయం ఆలయం వద్దకు వచ్చిన కవితకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

అనంతరం డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య ఆమె బంగారు బోనాన్ని తలకెత్తుకుని ఆలయంలోకి నడిచారు. 1008 మంది మహిళలు 1008 బోనాలతో కవిత తెచ్చిన బంగారు బోనానికి తోడుగా అనుసరించారు. కవిత వచ్చిన సమయంలో ఆలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఊరేగింపులో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Hyderabad
Secunderabad
Ujjaini
Mahankali
K Kavitha
Bangaru Bonam

More Telugu News