Secunderabad: అమరావతి నుంచి హైదరాబాద్ బయలుదేరిన పవన్ కల్యాణ్!

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోనున్న జనసేనాని
  • అత్యంత వైభవంగా సాగుతున్న బోనాల పండగ
  • తొలి బోనం సమర్పించిన తలసాని శ్రీనివాసయాదవ్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని రైతులతో నిన్న సమావేశమైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నేటి ఉదయం హైదరాబాద్ పయనమయ్యారు. నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవం జరుగుతూ ఉండటంతో ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారని జనసేన వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు పవన్ ఆలయానికి వస్తారని, ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపాయి.

కాగా, ఈ ఉదయం నాలుగున్నర గంటల నుంచి అమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల కొద్దీ భక్తులు బారులు తీరారు. తొలి బోనాన్ని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమర్పించారు. మరికాసేపట్లో నిజామాబాద్ ఎంపీ కవిత బోనం సమర్పించేందుకు ఆలయానికి రానుండగా, ఆపై సతీ సమేతంగా సీఎం కేసీఆర్ అమ్మను దర్శించుకోనున్నారు. పలువురు ప్రముఖులు, వీఐపీలు ఆలయానికి వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు.
Secunderabad
Hyderabad
Pawan Kalyan
Mahankali
Bonalu
Talasani
KCR
K Kavitha

More Telugu News