ఇటు ప్రియుడిని మరువలేక, అటు తల్లిదండ్రుల పరువు తీయలేక... తనువు చాలించిన యువతి!
- హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఘటన
- కులం వేరు కావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు
- ఆత్మహత్య చేసుకుని మరణించిన సుష్మ
ఈ విషయం సుష్మ తల్లిదండ్రులకు తెలియడంతో గొడవలు కూడా అయ్యాయి. కులాలు వేరువేరన్న కారణంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో సుష్మ బంధువుల ఫిర్యాదు మేరకు షీ టీమ్స్ బృందం సంతోష్ కు కౌన్సెలింగ్ కూడా ఇచ్చింది. సుష్మను వదులుకోలేని సంతోష్, గతంలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో సుష్మ, కుటుంబం పరువు పోతుందన్న మనస్తాపంతో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.