USA: వికీలీక్స్ ఫేమ్ అసాంజేను బయటకు పంపేస్తామంటున్న ఈక్వెడార్!

  • అమెరికాకు మోస్ట్ వాంటెడ్ గా జూలియన్ అసాంజే
  • తమ రాయబార కార్యాలయం నుంచి పంపేస్తామన్న ఈక్వెడార్ అధ్యక్షుడు
  • బయటకు వస్తే అరెస్టయ్యే అవకాశం
అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న జూలియన్‌ అసాంజేను త్వరలో తమ ఎంబసీ కార్యాలయం నుంచి బయటకు పంపిస్తామని ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మెరెనో వెల్లడించారు. అమెరికాకు చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన, గత ఆరేళ్లుగా... అంటే 2012 నుంచి లండన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆశ్రయం పొందే హోదా ఉందని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఈక్వెడార్, ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటించడం గమనార్హం. కాగా, అసాంజేపై పలు దేశాల వారెంట్లు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఆయన బయటకు వస్తే, బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసి అమెరికాకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
USA
Britain

More Telugu News